బ్రేకింగ్..రమేష్ బాబు అంత్యక్రియల అంశంపై కుటుంబీకుల కీలక సూచన.!

Published on Jan 9, 2022 10:00 am IST

టాలీవుడ్ లెజెండరు నటులు సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద తనయుడు ఘట్టమనేని రమేష్ బాబు నిన్న రాత్రి తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా తన తుది శ్వాస విడిచారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనతో టాలీవుడ్ వర్గాల్లో మరియు ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరి పలువురు సినీ ప్రముఖులు మహేష్ మరియు కృష్ణ గారు కుటుంబానికి వారి సంతాపాన్ని వ్యక్త పరిచారు. అయితే ఇప్పుడు తాజాగా ఘట్టమనేని కుటుంబం వారు రమేష్ బాబు అంత్యక్రియల అంశాలపై కీలక సమాచారాన్ని సూచనలను ఇప్పుడు అందించారు.

ఈరోజు ఉదయం 11 గంటలకు పద్మాలయ స్టూడియోస్ లో ఆయన పార్థివ దేహాన్ని సందర్శనకు ఉంచనుండగా మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపనున్నారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా వారి శ్రేయోభిలాషులకు ఇతరులు అందరికీ కూడా దహన సంస్కారాల స్థలంలో ఎక్కువగా గుమిగూడకుండా ఉండాలని విన్నవించుకున్నారు.

సంబంధిత సమాచారం :