మహాప్రస్థానంలో ముగిసిన రమేష్ బాబు అంత్యక్రియలు.!

Published on Jan 9, 2022 2:55 pm IST

నిన్ననే ఊహించని విధంగా టాలీవుడ్ సీనియర్ హీరో ఘట్టమనేని కృష్ణ గారి ఇంట తీరని విషాదం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఒక్కసారిగా మహేష్ బాబు మరియు వారి కుటుంబీకుల ఇంట తీరని విషాదం నెలకొంది. మరి ఈరోజు పలు కీలక అంశాల నడుమ జూబ్లీహిల్స్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి మహాప్రస్థానం లో దహన సంస్కార కార్యక్రమం పూర్తి చేయాలని నిశ్చయించారు.

మరి ఈ అంత్య క్రియలు కరోనా నిబంధనలుతో కుటుంబ సభ్యులు పూర్తి చెయ్యగా ఘట్టమనేని రమేష్ బాబు పార్థివ దేహపు చితికి ఆయన కుమారుడు జయకృష్ణ నిప్పు పెట్టారు. అయితే మహేష్ బాబు తనకి ఇటీవలే కరోనా సోకగా ఈ అంత్యక్రియల్లో హాజరు కాలేకపోయారు కానీ తనలోని వ్యథను సోషల్ మీడియాలో పంచుకొని విపరీతమైన భావోద్వేగానికి లోనయ్యారు.

సంబంధిత సమాచారం :