బాక్సాఫీస్ వద్ద ‘ఘాజి’ హవా !

బాక్సాఫీస్ వద్ద ‘ఘాజి’ హవా !

Published on Feb 19, 2017 11:56 AM IST


భారీ పాజిటివ్ టాక్ మధ్య ఈ నెల 17న విడుదలై ప్రేక్షకులు, విమర్శకులు, సినీ పెద్దల నుండి ప్రసంశలందుకుంటున్న ‘ఘాజి’ చిత్రం కలెక్షన్ల విషయంలోనూ సత్తా చూపుతోంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విడుదలైన మొదటి రోజు శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూ. 4.25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం వారాంతం శనివారం మరింత పుంజుకుని రూ. 5. 25 కోట్లు వసూలు చేసింది.

దీంతో రెండు రోజులకు కలిపి మొత్తం రూ. 9.50 కోట్ల కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ముఖ్యంగా హిందీ వెర్షన్లో రెండు రోజుల్లో రూ. 3.90 కోట్లు దక్కించుకోవడం విశేషం. అలాగే ఓవర్సీస్లో సైతం బాగానే ప్రభావం చూపుతోంది. మొదటి రోజు శుక్రవారం $141,291 కలెక్ట్ చేసింది. ఇక వచ్చే శుక్రవారం వరకు కొత్త సినిమా రిలీజ్ లేకపోవడం, ఉన్న వాటిలో ఈ చిత్రమే కాస్త స్పెషల్ గా కనిపిస్తుండటం ఈ వసూళ్లు ఇలాగే స్టడీగా రన్ అయ్యే ఛాన్సుంది. పివిపి, మాటినీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సబ్ మెరైన్ డ్రామాను నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు