ఓటిటిలో “ఘోస్ట్” హిందీ వెర్షన్ కి సూపర్బ్ రెస్పాన్స్.!

ఓటిటిలో “ఘోస్ట్” హిందీ వెర్షన్ కి సూపర్బ్ రెస్పాన్స్.!

Published on Nov 10, 2022 12:00 PM IST

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున లేటెస్ట్ గా నటించిన సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ది ఘోస్ట్”. టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ అందుకొని ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. ఇక ఈ చిత్రం అయితే రీసెంట్ గానే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాగా తెలుగు వెర్షన్ లో మొదటి వారంలోనే టాప్ పొజిషన్ కి వచ్చేయగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా హిందీ వెర్షన్ లో సినిమా అదరగొడుతుంది.

ఇండియన్ వైడ్ అయితే ఈ చిత్రం హిందీ వెర్షన్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ నిలిచింది. అలాగే తెలుగు వెర్షన్ లో అయితే నాలుగో ప్లేస్ లో ట్రెండ్ అవుతూ నిలిచింది. మొత్తానికి అయితే ఓటిటిలో ఈ చిత్రం సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అయితే హీరోయిన్ గా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించగా గల్ పనాగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు