‘ఘోస్ట్’ హిందీ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

Published on Sep 21, 2023 8:00 pm IST

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా ఎం జి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఘోస్ట్. ఈ మూవీని సందేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై సందేశ్‌ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్‌లో అల‌రించనున్నారు.

ఇప్పటికే ఘోస్ట్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. పాన్ ఇండియన్ రేంజ్ లో అక్టోబర్ 19న గ్రాండ్ గా పలు భాషల్లో ఈ మూవీ ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. కాగా ఈ మూవీ యొక్క హిందీ శాటిలైట్, డిజిటల్ మరియు థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ సంస్థ పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సొంతం చేసుకున్నారు. కాగా ఇది వారి సంస్థ కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్న తొలి కన్నడ సినిమా కావడంతో గ్రాండ్ లెవెల్లో హిందీ బెల్ట్ లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :