అమ్మాయిలు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్లి చూడాల్సిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’ – థాంక్స్ మీట్ లో అల్లు అరవింద్

Published on Feb 5, 2023 2:27 am IST


యువ నటుడు సుహాస్ హీరోగా చాయ్ బిస్కెట్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన్న లేటెస్ట్ ఫామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ రైటర్ పద్మభూషణ్. టీనా శిల్ప రాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మించగా కీలక పాత్రల్లో రోహిణి, ఆశిష్ విద్యార్థి, గౌరీ ప్రియ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు చేసారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ మూవీ యొక్క పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

కాగా మంచి అంచనాలతో రిలీజ్ అయిన రైటర్ పద్మభూషణ్ మూవీ నిన్న ప్రేక్షకాభిమనుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక తమ మూవీని ఆడియన్స్ ఎంతో బాగా ఆదరణఆదరిస్తుండడంతో నేడు మూవీ యూనిట్ హైదరాబాద్ లో థాంక్స్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ మీట్ కి విచ్చేసిన ప్రత్యేక అతిథి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, సినిమాలోని తన పాత్రలో హీరో సుహాస్ చాలా బాగా నటించారని, అలానే దర్శకుడు షణ్ముఖ్ ప్రశాంత్ అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. అమ్మాయిలు చక్కగా వారి ఫ్యామిలీ తో కలిసి వెళ్లి రైటర్ పద్మభూషణ్ మూవీ చూడవచ్చని తెలిపారు. ఆద్యంతం ఆకట్టుకునే మంచి కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాని నిర్మించిన అనురాగ్, శరత్ లతో పాటు యూనిట్ మొత్తానికి కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేసారు అల్లు అరవింద్.

సంబంధిత సమాచారం :