ట్రెండింగ్ అవుతోన్న ‘గ్లాస్‌ మేట్స్’ !

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కాగా ఏప్రిల్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే ‘పరుగు పరుగు’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఆదివారం ‘గ్లాస్‌ మేట్స్’ అనే మరో లిరికల్ వీడియో సాంగ్‌ ను రిలీజ్ చేసింది. ‘కమాన్ బాయ్స్.. అంటూ మొదలైయ్యే ఈ పాట గ్లాస్ మేట్సూ గొప్పతనం గురించి చెప్తూ ఫన్నీగా సాగుతుంది.

ప్రస్తుతం ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. చక్కని పదాలతో చంద్రబోస్ రాసిన ఈ పాటకు సింగర్స్ రాహుల్ సిప్లిగుంజ్, పెంచల్ దాస్ పాడిన విధానం కూడా చాలా బాగుంది. దాంతో పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా నటిస్తోంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version