ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రేక్షకులు పట్టం కట్టారు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో రఫ్ఫాడించింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు మరో బ్లాస్‌ను రెడీ చేస్తోంది. ‘పుష్ప 2’ చిత్రానికి అదనపు సీన్స్‌ను యాడ్ చేసి రీ-లోడెడ్ వెర్షన్‌ను జనవరి 17 నుంచి ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈ సినిమా రన్‌టైమ్ మరో 20 నిమిషాల పాటు పెరగనుంది. ఇక ఈ సినిమాలో ఎలాంటి సీన్స్ యాడ్ చేయనున్నారా.. అవి ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా, ఇప్పుడు ఈ రీ-లోడెడ్ వెర్షన్ సీన్స్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. సంక్రాంతి కానుకగా ఈ ట్రీట్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్ గ్లింప్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.