ఇంకొద్దిసేపట్లో సప్రైజ్ ఇవ్వనున్న రోబో టీమ్ !

25th, August 2017 - 01:03:22 PM


దక్షిణాది సినీ ప్రేక్షకులు, తలైవర్ రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘రోబో 2’. శంకర్ సూపర్ హిట్ సినిమా ‘రోబో’ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ వ్యయంతో అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా చాలా రోజులు జరిగి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్ర టీమ్ నుండి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే బయటకురాగా ఇప్పుడు ఒక గ్లిమ్ప్ వీడియోను రిలాజ్ చేయనున్నారు.

ఈ వీడియోలో ప్రాజెక్ట్ మొదలైన దగ్గర్నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ముఖ్య కార్యక్రమాల తాలూకు ఫుటేజస్ పొందుపరుస్తారట. దీన్ని సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. దీంతో రజనీ అభిమానులు ఇప్పటి నుండే హడావుడి మొదలుపెట్టేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ కుమార్ నెగెటివ్ రోల్ చేస్తుండగా అమీ జాక్షన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2018 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.