రెండు గ్లోబల్ సినిమాలు: ‘వారణాసి’ పీక్.. ‘రామాయణ’ వీక్!

Varanasi-Ramayana

ఇప్పుడిప్పుడే భారతీయ సినిమా కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచ సినిమా దగ్గర ఒక సుస్థిర స్థానంని సంపాదించుకోవడానికి మరింత కృషి చేస్తుంది. ఇక అందుకు మన దగ్గర ఉన్న టాప్ మోస్ట్ దర్శక నిర్మాతలు అలాగే సినిమా పట్ల ఫ్యాషన్ ఉన్న కొత్త టాలెంట్ కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే ఇప్పుడున్న సమయంలో ఎంత పెద్ద సినిమా చేసినా సరే దానిని ప్రపంచంలోకి ఎలా తీసుకెళ్లాం అనేది కూడా ముఖ్యం. ఇలా ఇండియన్ సినిమా నుంచి గ్లోబల్ లెవెల్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ అంతే రీతిలో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రాలే ‘వారణాసి’ (Varanasi), ‘రామాయణం’ (Ramayana).

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతుంది ‘వారణాసి’. ఇక ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ గ్రాసర్ దంగల్ దర్శకుడు నితీష్ తివారి, రణబీర్, యష్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమానే రామాయణం. అయితే ఈ రెండిటికి నడుమ కొన్ని పోలికలు ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో ఓ సినిమా ముందు ఓ సినిమా వెనుక బడ్డాయి.

Varanasi – Ramayana వారణాసి, రామాయణ నడుమ పోలికలు

ఈ రెండు సినిమాలు కూడా ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకం గానే వస్తున్నాయి. ఈ రెండూ గ్లోబల్ ప్రాజెక్ట్ లు గానే అనౌన్స్ చేయబడ్డాయి. అంతే కాకుండా భారతీయ సినిమా నుంచి ఐమ్యాక్స్ వెర్షన్ లో తెరకెక్కుతున్న రెండు సినిమాలు కూడా ఇవే. వీటితో పాటుగా ఈ రెండు సినిమాల బడ్జెట్ లూ 1000 కోట్లకి పైమాటే.. అంతేనా రెండు సినిమాల్లో కూడా డివోషన్ టచ్ ఉంది, అందులోనీ రామాయణ అంశాలే కావడం గమనార్హం. ఇలా పలు పోలికలు అయితే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ల విషయంలో కనిపిస్తాయి.

Nitesh Tiwari’s Ramayana – పబ్లిసిటీలో వారణాసి తర్వాతే రామాయణం..

తన సినిమాని పబ్లిసిటీ చేయడంలో ఇండియన్ సినిమా దగ్గర దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. తన దర్శకత్వం ఎంత పక్కాగా ఉంటుందో.. తన సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ విషయంలో కూడా తాను అంతకు మించిన శ్రద్ధ వహిస్తారు. ఇప్పుడు ఇదే దీని కంటే ముందే ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా అనౌన్స్ అయ్యిన రామాయణ కంటే ఎక్కువ మాట్లాడుకునేలా చేస్తుంది.

వారణాసి సినిమా రావడానికి ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ రామాయణ మొదటి భాగం ఈ ఏడాది లోనే రానుంది. అయినప్పటికీ పాన్ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లో, మీడియాలో మోగుతున్న సినిమా పేరు వారణాసి. తన సినిమా విడుదల కావడానికి ఎంతో సమయం ఉన్నప్పటికీ పలు అంతర్జాతీయ మీడియాలతో రాజమౌళి సినిమా ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు, ఆఫ్ లైన్ లో కూడా ఎన్నో విశేషాలు పంచేసుకున్నారు.

కానీ ఈ విషయాల్లో పోలిస్తే వారణాసి కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రామాయణ యూనిట్ మాత్రం వెనుకబడ్డారని చెప్పక తప్పదు. సాలిడ్ సబ్జెక్టు.. హన్స్ జిమ్మర్ (Hans Zimmer) లాంటి సంగీత దర్శకుడు, భారీ స్కేల్ లాంటివి పెట్టుకున్నప్పటికీ పబ్లిసిటీ పరంగా రామాయణ టీం వీక్ గానే ఉంది. మరి దీనిని రామాయణ టీం గుర్తించి వీరు కూడా ప్రపంచ ఆడియెన్స్ లోకి రామాయణ చిత్రాన్ని వారణాసి లానే తీసుకెళ్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Exit mobile version