వైరల్ పిక్స్ : సూట్ లో సూపర్ స్టైలిష్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.!

Published on Feb 26, 2023 4:00 pm IST

ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరు గట్టిగా వినపడుతుంది. తన సెన్సేషనల్ హిట్ “రౌద్రం రణం రుధిరం” తో అయితే ఎప్పుడో ఓ గ్లోబల్ స్టార్ గా మారిన తాను రీసెంట్ గా మరింత ప్రముఖుల చేత ఇదే ట్యాగ్ తో పిలవబడుతున్నాడు. దీనితో చరణ్ ఓ గ్లోబల్ ఐకాన్ గా మారగా లేటెస్ట్ గా తాను హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

మరి ఈ ఈవెంట్ కోసం తనకు ప్రిపేర్ చేసిన సాలిడ్ లుక్ తాలూకా ఫోటోలు కొన్ని మంచి వైరల్ గా మారాయి. మరి మాంచి సూట్ తో స్టైలిష్ గా రగ్గుడ్ గడ్డం లుక్ తో అయితే తాను కనిపిస్తున్నాడు. దీనితో ఈ సూపర్ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో మంచి వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం చరణ్ యూఎస్ లోనే ఉండగా చిత్ర యూనిట్ తో కలిసి ఈ మార్చ్ 1 న జరిగే RRR స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొననున్నాడు. అలాగే నెక్స్ట్ ఆస్కార్ ఈవెంట్ కి కూడా హాజరు కానున్నాడు.

సంబంధిత సమాచారం :