గ్లోబల్ స్టార్ ర్యాంపేజ్.. వరల్డ్ వైడ్ డే 1 రికార్డు ఓపెనింగ్స్

గ్లోబల్ స్టార్ ర్యాంపేజ్.. వరల్డ్ వైడ్ డే 1 రికార్డు ఓపెనింగ్స్

Published on Jan 11, 2025 10:19 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన స్టైలిష్ సాలిడ్ ఎమోషనల్ ట్రీట్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా వచ్చిన ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ అందుకుంటుంది అనుకున్న ఈ సినిమా డే 1 ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఇలా డే 1 కి ఏకంగా 186 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలిపారు. దీనితో చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డు అని చెప్పాలి. మరి మొత్తానికి ఇలా గ్లోబల్ స్టార్ మేనియా స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ పండుగలో కూడా సినిమాకి మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ ఉంది. మరి చూడాలి గేమ్ ఛేంజర్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో అనేది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు