రేపటి నుంచి “గాడ్ ఫాదర్” అడ్వాన్స్ బుకింగ్స్!

Published on Sep 30, 2022 7:00 pm IST


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. రేపటి నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయనేది ఇప్పుడున్న మాట. హైదరాబాద్ నగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు బుకింగ్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో అందరినీ నిరాశపరిచాడు. మరియు పరిశ్రమలో తానే బాస్ అని నిరూపించుకోవడానికి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ రావాలి. సత్యదేవ్ మెయిన్ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :