‘గాడ్ ఫాదర్’ సక్సెస్ పై మెగాస్టార్ ని విష్ చేసిన టీమ్

Published on Oct 6, 2022 12:00 am IST

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గాడ్ ఫాదర్ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో బ్రహ్మ అనే పవర్ఫుల్ రోల్ లో కనిపించగా నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సల్మాన్ ఖాన్ తదితరులు ఇతర రోల్స్ చేసారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ మూవీ ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందింది.

ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీకి మోహన్ రాజా డైరెక్టర్. మొత్తంగా అందరి అంచనాలు తమ గాడ్ ఫాదర్ మూవీ అందుకుని ప్రస్తుతం బాగా కలెక్షన్ తో కొనసాగుతుండడంతో కొద్దిసేపటి క్రితం మూవీ టీమ్ ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియచేసారు. కాగా గాడ్ ఫాదర్ కోసం యావన్మంది యూనిట్ ఎంతో శ్రమపడ్డారని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో పాటు టెక్నీషియన్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన మెగాస్టార్, మంచి స్క్రిప్ట్ తో సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే విషయాన్ని ఈ మూవీ ద్వారా మరొక్కసారి రుజువు చేసారని అన్నారు.

సంబంధిత సమాచారం :