‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ రిలీజ్ కి రెడీ

Published on Oct 3, 2022 4:07 pm IST

మెగాస్టార్ చిరంజీవితో మోహన్ రాజా తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ రోల్ చేస్తుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఒక సర్ప్రైజింగ్ రోల్ లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు నిర్మించాయి.

నయనతార, సత్యదేవ్, మురళి శర్మ, సముద్రఖని, సునీల్ తదితరులు ఇతర రోల్స్ చేస్తున్న గాడ్ ఫాదర్ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ తో పాటు రెండు సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక నేడు సాయంత్రం 6 గం. 03 ని. లకు ఈ మూవీ నుండి టైటిల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ కోసం థమన్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసారని, అలానే మూవీలో ఈ సాంగ్ ఎంతో బాగుంటుందని చెప్తోంది యూనిట్. మొత్తంగా అందరిలో ఈ విధంగా భారీ అంచనాలు ఏర్పరిచిన గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ తరువాత ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :