లేటెస్ట్ : ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Sep 28, 2022 2:26 am IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ గాడ్ ఫాదర్. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని వంటి వారు కీలక రోల్స్ చేసిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఒక సర్ప్రైజింగ్ రోల్ పోషించగా ఈ మూవీని మోహన్ రాజా తెరకెక్కించారు. ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అయితే మ్యాటర్ ఏమిటంటే, రేపు అనంతపూర్ లో ప్రేక్షకాభిమానుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా జరుగనున్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ట్రైలర్ ని రేపు రాత్రి 8 గంటలకు విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రకటించారు. అక్టోబర్ 5 న దసరా పండుగ సందర్భంగా రానున్న గాడ్ ఫాదర్ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తుండగా దీనికి నిరవ్ షా ఫోటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం :