మరో కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ‘గోదారి గట్టుపైన’ !

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’. ఐతే, అనూహ్యంగా వేగంగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టింది. కేవలం మూడు వారాల థియేట్రికల్ ప్రదర్శన తర్వాత, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కోసం మొదటగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు, మరింతమంది ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నంలో, చిత్ర నిర్మాతలు మరో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆహా’లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

కాగా థియేట్రికల్ రిలీజ్ లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. మరి, ఈ డ్యూయల్- ఓటీటీ ప్లాట్‌ఫామ్ ల స్ట్రీమింగ్ వ్యూహం ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో, అభినవ్ రావు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన సంగీతం పర్వాలేదు అనిపించుకుంది.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version