లేటెస్ట్..”గాడ్ ఫాథర్” సెన్సార్ పూర్తి..డైరెక్టర్ సాలిడ్ పోస్ట్.!

Published on Sep 23, 2022 4:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సాలిడ్ పొలిటికల్ డ్రామా “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం పై ఇప్పుడు మంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాగా నేరుగా మెగాస్టార్ నే ప్రమోషన్స్ కోసం దిగడం ఆసక్తిగా మారింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై దర్శకుడు మోహన్ రాజా సాలిడ్ పోస్ట్ చెయ్యడం ఆసక్తిగా మారింది.

ఈ చిత్రం సెన్సార్ ని కంప్లీట్ చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది అని తెలిపారు. అంతే కాకుండా సెన్సార్ యూనిట్ నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది అని ఇక ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని తాను తెలిపారు. మొత్తానికి అయితే పాజిటివ్ న్యూస్ తోనే తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :