నైజాంలో “గాడ్ ఫాథర్” మొదటి రోజు వసూళ్లు ఎంతంటే..!

Published on Oct 6, 2022 10:28 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మోహన రాజా తెరకెక్కించిన ఈ చిత్రం నిన్న దసరా కానుకగా రిలీజ్ అయ్యి సాలిడ్ పాజిటివ్ టాక్ ని అయితే సొంతం చేసుకొని మెగా కం బ్యాక్ లా మారింది. మరి ఈ చిత్రం వసూళ్లు కూడా మంచి నంబర్స్ తోనే స్టార్ట్ అవుతున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

మరి మొదటి రోజు ఈ చిత్రం నైజాం వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. ఈ చిత్రానికి మొదట రోజు నైజాం లో జి ఎస్ టి తో కలిపి 3 కోట్ల షేర్ మార్క్ అందుకుందట. మంచి పోటీలో వచ్చిన ఈ చిత్రానికి ఇది డీసెంట్ నెంబర్ ని పి ఆర్ లు చెబుతున్నారు. ఇక ఈరోజు నుంచి వీకెండ్ నాటికి అయితే మరిన్ని మంచి వసూళ్లు నమోదు అయ్యే ఛాన్స్ బాగా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సల్మాన్ ఖాన్ సాలిడ్ రోల్ లో నటించారు. అలాగే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :