ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మెగాస్టార్ “గాడ్ ఫాథర్”.!

ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మెగాస్టార్ “గాడ్ ఫాథర్”.!

Published on Nov 19, 2022 7:02 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “గాడ్ ఫాథర్”. మరి ఈ చిత్రాన్ని మలయాళ చిత్రం లూసిఫర్ కి రీమేక్ గా తెలుగు లో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. మరి ఈ చిత్రంతో అయితే మెగాస్టార్ భారీ హిట్ అందుకోగా ఇప్పుడు ఈ చిత్రం ఫైనల్ గా అయితే ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

మరి ఈ చిత్రం డిజిటల్ హక్కులని అయితే దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు తెలుగు మరియు హిందీ భాషల్లో సొంతం చేసుకోగా ఈరోజు నుంచి అయితే ఈ చిత్రం ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి మరోసారి ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చెయ్యాలి అనుకునే వారు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రంలో అయితే నయనతార అలాగే సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు