‘గాడ్ ఫాదర్’ ప్లాష్ బ్యాక్ కోసం ప్రత్యేక పాట !

‘గాడ్ ఫాదర్’ ప్లాష్ బ్యాక్ కోసం ప్రత్యేక పాట !

Published on Sep 6, 2021 10:18 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షెడ్యుల్ లో గద్దర్ పై రానున్న సాంగ్ తాలుకు విజువల్స్ ను షూట్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరో పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను ఎలివేట్ చేస్తూ గద్దర్ ఒక ప్రత్యేక పాట పాడుతున్నారు.

ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా అనసూయ నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్‌ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర చాల కీలకంగా ఉంటుంది. ఆ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని దర్శకడు మోహన్ రాజా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు