“గాడ్ ఫాథర్” ప్రీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

“గాడ్ ఫాథర్” ప్రీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

Published on Sep 24, 2022 2:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ కి ప్లాన్ చెయ్యగా ఇప్పుడు మేకర్స్ అయితే దగ్గరుండి ఈ గ్యాప్ లో కీలక పనులు అన్నీ ఒకొకటిగా సెట్ చేస్తూ వెళ్తున్నారు. ఇక ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా..

ఇప్పుడు మేకర్స్ అయితే ఈ అవైటెడ్ ప్రీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. ప్రస్తుతం గాడ్ ఫాథర్ ప్రీ రిలీజ్ కి గాను స్థలం ఎక్కడ ఫిక్స్ చెయ్యాలి అన్నది కన్ఫర్మ్ అయ్యింది అని మరి అంతా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక అలాగే జరిగే తేదీని అనౌన్స్ చేస్తామని తెలిపారు. మరి ఈ డేట్ అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు