“గాడ్ ఫాథర్” అవుట్ పుట్ పై మేకర్స్ సాలిడ్ కాన్ఫిడెన్స్..!

Published on Sep 25, 2022 3:13 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సాలిడ్ పొలిటికల్ డ్రామా ఇప్పుడు రిలీజ్ కి దగ్గర అవుతుండగా మెల్లగా పాన్ ఇండియా రిలీజ్ సినిమాగా ఇది మారుతుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా దగ్గర పడుతున్న తరుణంలో అయితే మేకర్స్ సినిమా అవుట్ పుట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఎక్కడకి కావాల్సిన అక్కడ హంగులు పర్ఫెక్ట్ గా వచ్చాయని డెఫినెట్ గా ఈసారి అయితే మెగాస్టార్ డిజప్పాయింట్ చెయ్యరని మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న టాక్.

దీనితో అయితే గాడ్ ఫాథర్ విషయంలో మరింత పాజిటివ్ బజ్ నెలకొంటుంది. మరి ఈ చిత్రం అయితే అన్ని అంచనాలు అందుకుంటుందో లేదో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించగా థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :