“గాడ్ ఫాథర్” అక్కడ మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనా.!

Published on Sep 30, 2022 6:41 pm IST

మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లు నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు సహా హిందీ మరియు మళయాళ భాషల్లో అయితే మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సల్మాన్ లాంటి స్టార్ కూడా ఉండడంతో హిందీ మార్కెట్ విషయంలో కూడా అందరిలో చాలా ఆసక్తి నెలకొంది.

కానీ మేకర్స్ అయితే హిందీలో మాత్రం ఇంకా ప్రమోషన్స్ విషయంలో వెనకబడే ఉన్నారన్న మాట కూడా ఇప్పుడు వినిపిస్తుంది. హిందీలో సినిమాకి అటెన్షన్ కావాలి అంటే అక్కడ ఎంత పెద్ద స్టార్ ఉన్నా మంచి ప్రమోషన్స్ తప్పనిసరి. మరి గాడ్ ఫాథర్ కి అయితే ఎపుడు మొదలవుతాయో అనేది చూడాలి. ఇవి కూడా కరెక్ట్ గా వర్కౌట్ అయితే మాత్రం హిందీలో కూడా మంచి వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అవుతాయి.

సంబంధిత సమాచారం :