‘గాడ్‌ ఫాదర్‌’గా ఫిక్స్ అయిన మెగాస్టార్ !

‘గాడ్‌ ఫాదర్‌’గా ఫిక్స్ అయిన మెగాస్టార్ !

Published on Aug 22, 2021 1:01 PM IST


దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా తాజాగా ఈ రీమేక్‌ కోసం ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక టైటిల్ ను రివీల్ చేస్తూ వదిలిన మోషన్‌ టీజర్‌ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

తల పై క్యాప్‌ తో చేతిలో గన్‌ తో చిరంజీవి స్టైలిష్‌ గా కనిపించారు. ఇక ఈ మోషన్ టీజర్ లో తమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని దర్శకడు మోహన్ రాజా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అలాగే తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మార్పులు చేశారట. ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు