ఓటిటిలో సాలిడ్ రెస్పాన్స్ తో “గాడ్ ఫాథర్”.!

ఓటిటిలో సాలిడ్ రెస్పాన్స్ తో “గాడ్ ఫాథర్”.!

Published on Nov 23, 2022 9:00 AM IST

మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ల కలయికలో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గాడ్ ఫాథర్”. థియేటర్స్ లో ఓ మోస్తరుగా రాణించిన ఈ చిత్రం రీసెంట్ గానే తెలుగు మరియు హిందీ భాషల్లో అయితే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు మంచి రెస్పాన్స్ తో అయితే నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతుంది. మరి ఈ చిత్రంలో తెలుగులో 3 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండగా హిందీలో అయితే ఇండియా వైడ్ నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ నిలిచింది. దీనితో ఈ చిత్రం అయితే ఓటిటి లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు