యూఎస్ లో అదరగొడుతున్న “గాడ్ ఫాథర్”..!

Published on Oct 7, 2022 2:58 pm IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన రాజా తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం “గాడ్ ఫాథర్”. మరి మంచి అంచనాలు నడుమ థియేటర్స్ లో వచ్చిన ఈ చిత్రం అయితే డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించగా ఓవర్సీస్ లో కూడా డీసెంట్ గానే స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం రెండో రోజు నుంచి అయితే సాలిడ్ వసూళ్లు నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

ఆల్రెడీ రెండో రోజుకే మంచి జంప్ అందుకోగా ఇప్పుడు మూడో రోజు మొదటి రోజు కన్నా బెటర్ వసూళ్లు నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ హాఫ్ మిలియన్ మార్క్ ని దాటిన ఈ చిత్రం 1మిలియన్ దిశగా వెళ్తుంది. మొత్తానికి అయితే మెగాస్టార్ మళ్ళీ మాస్ కం బ్యాక్ గట్టిగా ఇచ్చారని చెప్పాలి. దీనితో అయితే మెగాస్టార్ కం బ్యాక్ తో మెగా ఫాన్స్ మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించగా సత్యదేవ్, నయనతార, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :