‘గాడ్ ఫాదర్’ నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలివే !

Published on Oct 3, 2022 9:19 pm IST

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకుడిగా రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా అక్టోబర్ 5న విడుదలవుతున్న ఈ చిత్రంపై మిగిలిన రాష్ట్రాల్లో కూడా డీసెంట్ బజ్ ఉంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా మంచి ధరకే లాక్ అయిందని టాక్ ఉంది. తాజా సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ నైజాం రైట్స్ 21 కోట్లకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది.

ఇక మెగాస్టార్ తన గెటప్ అండ్ సెటప్ తో షేక్ చేయనున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి కనిపించే సీన్స్ అదిరిపోయేలా ఉంటాయట. మొత్తానికి ఈ సినిమాతో ఈ దసరాకి జాతరే. పైగా ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు.

కాగా పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, సత్య దేవ్‌లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :