త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “గాడ్సే”

Published on Mar 28, 2023 12:32 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా, డైరెక్టర్ గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గాడ్సే. Ck స్క్రీన్స్ పై సీ.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. గతేడాది థియేటర్ల లో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. అయితే ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

గాడ్సే చిత్రం త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీ లో ప్రసారం కానుంది. శాండీ అద్దంకి ఈ చిత్రానికి సంగీతం అందించగా, నాగబాబు, బ్రహ్మాజీ లు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :