సత్యదేవ్ “గాడ్సే” ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న మెగా ప్రిన్స్!

Published on Jun 8, 2022 2:45 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం గాడ్సే. ఈ చిత్రం జూన్ 17, 2022న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. ప్రమోషన్స్‌లో భాగంగా రేపు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, రేపు ఉదయం 10 గంటలకు థియేట్రికల్ ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో తనికెళ్ల భరణి, నాగబాబు కొణిదెల, బహ్మాజీ, నోయల్ సీన్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ మరియు శాండీ అద్దంకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :