మంచి వసూళ్లను రాబడుతోన్న “బంగార్రాజు”

Published on Jan 17, 2022 1:00 pm IST

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య లు హీరోలు గా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించడం జరిగింది.

ఈ చిత్రం విడుదల అయిన మూడు రోజుల్లో 53 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. బంగార్రాజు కి సంక్రాంతి పండుగ సీజన్ కలిసి వచ్చింది అని చెప్పాలి. జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లో రమ్య కృష్ణ, కృతి శెట్టి లు లేడీ లీడ్ రోల్స్ లో నటించడం జరిగింది. ఇదే తరహా వసూళ్లను బంగార్రాజు వీక్ డేస్ లో కూడా కొనసాగిస్తే సంక్రాంతి కి విజేత అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :