ఇతర భాషల్లో సత్తా చాటుతున్న పుష్ప…!

Published on Dec 25, 2021 1:41 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో సినిమా ఊహించని రీతిలో వసూళ్లను రాబడుతోంది.

మొదటి వారం ముగిసే సరికి మంచి వసూళ్లను సాధించి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తమిళ నాడు లో మొదటి వారం 16.3 కోట్ల రూపాయల ను వసూలు చేయడం జరిగింది. అదే విధంగా హిందీ లో మొదటి వారం కి గానూ 26.89 కోట్ల రూపాయలని వసూలు చేసింది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :