అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టిన పుష్ప!

Published on Jan 21, 2022 3:01 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా థియేటర్ల లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, మిగతా ప్రాంతాల్లో కూడా పుష్ప తన సత్తా ను చాటడం జరిగింది. అయితే ఈ చిత్రం ఇప్పటి వరకూ తమిళనాడు రాష్ట్రం లో 27 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను సాధించడం జరిగింది.

అల్లు అర్జున్ సరసన ఈ చిత్రం లో రష్మీక మందన్న నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఈ చిత్రం లో అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, ఫాహద్ ఫజిల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం సౌత్ భాషలతో పాటుగా, హిందీ లో సైతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటు లో ఉంది.

సంబంధిత సమాచారం :