బాలీవుడ్ లో దూసుకు పోతున్న పుష్ప!

Published on Dec 22, 2021 11:10 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది.

బాలీవుడ్ లో సరిగ్గా ప్రమోషన్స్ లేకపోయినప్పటికి ఈ చిత్రం ఐదవ రోజు 4.05 కోట్ల రూపాయల ను వసూలు చేయడం జరిగింది. ఇప్పటి వరకూ ఈ చిత్రం బాలీవుడ్ లో 20.14 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా యూ ఎస్ లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు.

సంబంధిత సమాచారం :