మంచి ధరకు అమ్ముడైన ‘రంగస్థలం 1985’ శాటిలైట్ రైట్స్ !

6th, November 2017 - 12:25:54 PM

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో రామ్ చరణ్ ‘రంగస్థలం 1985’ కూడా ఉంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీంతో చిత్ర హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే తెలుగు శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు కలిపి దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడవగా ఇప్పుడు హిందీ హక్కులు కూడా మంచి మొత్తానికే అమ్ముడైనట్టు సమాచారం.

ప్రముఖ హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఒకటి రూ. 10.50 కోట్లకు ఈ హక్కుల్ని కొనుగోలుచేసింది. రామ్ చరణ్ సినిమా కావడం, ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమాలకు బాలీవుడ్లో ఆదరణ పెదగడంతో ఇంత పెద్ద మొత్తానికి హక్కులు అమ్ముడయ్యాయి. 2019 వేసవికి విడుదలకానున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా సమంత నటిస్తుండగా ఆది పినిశెట్టి, అనసూయలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.