సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుడ్ లక్ సఖి’ !

Published on Nov 29, 2021 6:32 pm IST

‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా నటించిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. నగేష్ కుకునూరు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గతంలోనే విడుదల కావాలి. కానీ, కొన్ని కారణాల కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది.

సంబంధిత సమాచారం :