“గుడ్ లక్ సఖి” రిలీజ్ పై క్లారిటీ!

“గుడ్ లక్ సఖి” రిలీజ్ పై క్లారిటీ!

Published on Oct 20, 2021 10:00 AM IST

తెలుగు సినీ పరిశ్రమలో కీర్తి సురేష్ చేస్తున్న సినిమాల పై ఆసక్తి నెలకొంది. మహానటి చిత్రం తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. ఈ చిత్రం తో మరిన్ని అవకాశాలు రావడం మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్ లక్ సఖి చిత్రం ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

దిల్ రాజు సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి సుధీర్ చంద్ర పాడిరి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం నగేష్ కుకునూరు వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని నవంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని నవంబర్ 19 వ తేదీన థియేటర్ల లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం లో జగపతి బాబు మరియు ఆది పినిశెట్టి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు