కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” ట్రైలర్ విడుదల కి సిద్ధం!

కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” ట్రైలర్ విడుదల కి సిద్ధం!

Published on Jan 23, 2022 1:45 PM IST


కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నగేష్ కుకునూరు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్రం ను జనవరి 28 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను జనవరి 24 వ తేదీన ఉదయం 10:11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పాదిరీ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు