మహేష్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే వార్త !
Published on Jan 13, 2018 2:58 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివల కలయికలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సూపర్ హిట్ గా నిలవడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. అభిమానులు కూడా షూటింగ్ మొదలై చాన్నాళ్ళు కావొస్తుండటంతో అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అందుకే చిత్రం టీమ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. 15వ తేదీ సంక్రాంతి రోజున ఈ ఫస్ట్ లుక్ విడుదలకానుంది. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఇప్పటి నుండే పండుగ సందడి మొదలైపోయింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook