మెగా అభిమానులకు పండుగలాంటి వార్త !

pawan
వరుసగా ‘గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ’ వంటి చిత్రాల పరాజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో ‘ధృవ’ పై ప్రేక్షకుల్లో, మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేగాక ఇటీవల రిలీజైన టీజర్ సైతం బ్రహ్మాండమైన ఆదరణ పొంది 3 మిలియన్ల మార్క్ దాటేసింది. ఇక మెగా అభిమానులు ఈ సినిమా ఆడియో వేడుక కోసం, ఆ కార్యక్రమంలో రిలీజవబొయ్యే ట్రైలర్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి కోసమే ఓ పండుగలాంటి వార్త తాజాగా బయటికొచ్చింది.

అదేమిటంటే నవంబర్ 20న ఈ ఆడియో రిలీజ్ జరగనుంది. అంతేగాకా ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తారనే న్యూస్ కూడా వినవస్తోంది. కానీ చరణ్ టీమ్ నుండి పవన్ కళ్యాణ్ విషయాల్లో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ ఇదే గనుక నిజమై పవన్ వేడుకకు వస్తే మెగా హీరోలందరినీ మరోసారి ఒకే వేదికపై చూసే అవకాశం దక్కుతుంది అభిమానులకు. ఇకపోతే ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది.