ఫిల్మ్ ఫేర్ కు నామినేట్ అయిన ఎన్టీఆర్ !

18th, May 2017 - 01:05:05 PM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో మంచి నటుడు, డ్యాన్సరే కాకుండా సింగర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనలోని ఆ ప్రత్యేక ప్రతిభకే గుర్తింపు దక్కింది. ఈ మధ్య కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘చక్రవ్యూహ’ అనే సినిమాలో ‘గెలేయ గెలేయ’ అనే పాటను పాడారు ఎన్టీఆర్. ఎస్ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాట కన్నడలో చాలా పెద్ద హిట్టై ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించడమే కాక సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అందుకే తాజాగా అనౌన్స్ చేసిన కన్నడ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూట్ సింగర్ క్యాటగిరీలో ఎన్టీఆర్ నామినేట్ అయ్యారు. పాట పొందిన ఆదరణ, ఎన్టీఆర్ పాడిన విధానం చూస్తే అవార్డు ఎన్టీఆర్ కు దక్కే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం తారక్ నటిస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రేపు 19వ తేదీన రిలీజ్ కానుంది.