కళ్ళు చెదిరేలా ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీ బిజినెస్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రంపై సైన్ వర్గాల్లో, అభిమానుల్లో శిఖరస్థాయి అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటంతో మహేష్ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అంభిమానులంతా ధీమాగా ఉండగా డిస్ట్రిబ్యూషన్ వర్గాలు సైతం గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే సినిమా షూటింగ్ పూర్తికాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతున్నట్టు సమాచారం.

సినిమా యొక్క శాటిలైట్, డిజిటల్ హక్కులకు పెద్ద మొత్తాన్ని చెల్లించడానికి ప్రముఖ టీవీ ఛానెల్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు ముందుకొచ్చాయట. అంతేగాక డబ్బింగ్ రైట్స్ కూడ మంచి ధర పలుకుతున్నాయట. ఈ బిజినెస్ డీల్ మొత్తం ఎంతనేది టవర్లోనే తెలియనుంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 26వ రిపబ్లిక్ డే సందర్బంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది.