మాస్ మహారాజా ‘ధమాకా’ కి భారీ పబ్లిక్ రేటింగ్స్

మాస్ మహారాజా ‘ధమాకా’ కి భారీ పబ్లిక్ రేటింగ్స్

Published on Dec 24, 2022 12:00 AM IST


టాలీవుడ్ నటుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథని అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు దీనిని భారీ స్థాయిలో నిర్మించాయి. ఇక నేడు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ధమాకా మూవీ ఫస్ట్ షో నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

చాలా రోజుల తరువాత తమ అభిమాన నటుడి నుండి ఆశించిన మంచి కమర్షియల్ సినిమా వచ్చిందని పలువురు మాస్ మహారాజా ఫ్యాన్స్ అంటుంటే, ఆద్యంతం దర్శకుడు త్రినాథరావు మూవీని మంచి ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించారని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ధమాకా మూవీకి ప్రముఖ ఆన్ లైన్ టికెట్ పోర్టల్స్ అయిన బుక్ మై షో, పేటిఎం లలో భారీ పబ్లిక్ రేటింగ్స్ లభిస్తున్నాయి. బుక్ మై షో లో 9.4 రేటింగ్ అందుకున్న ఈ మూవీ పేటిఎం లో 96% రేటింగ్ అందుకోవడం విశేషం. మరి రాబోయే రోజల్లో ధమాకా మూవీ ఎంత మేర బాక్సాఫీస్ ధమాకాని చూపిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు