“గాడ్ ఫాథర్” ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్..!

“గాడ్ ఫాథర్” ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్..!

Published on Jul 5, 2022 7:05 AM IST


తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే అవైటెడ్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పాలి. రిలీజ్ చేసిన టీజర్ వీడియో అని కాకుండా ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు నుంచి మరియు ఆడియెన్స్ నుంచి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కనబడుతుంది.

అలాగే ఆచార్య తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో మెగాస్టార్ తన కం బ్యాక్ ఈ సినిమాతో ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో మెగాస్టార్ మళ్లీ మంచి హైప్ తీసుకొచ్చారు. ఇక ఈ విజయదశమి కానుకగా వస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కొణిదెల ప్రొడక్షన్స్ సహా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు