నిఖిల్ “18పేజెస్” సాంగ్స్ కి విశేష స్పందన!

నిఖిల్ “18పేజెస్” సాంగ్స్ కి విశేష స్పందన!

Published on Dec 15, 2022 12:10 AM IST


నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం 18పేజెస్. ఈ చిత్రం డిసెంబర్ 23, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం గా ఉంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం నుండి రిలీజైన మూడు పాటలకు (నన్నయ రాసిన, టైమ్ ఇవ్వు పిల్లా, ఏడు రంగుల వాన) యూ ట్యూబ్ లో 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కార్తికేయ2 తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న వరుస చిత్రం కావడం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు