“ఆడవాళ్ళు మీకు జోహార్లు” ట్రైలర్ కి విశేష స్పందన

Published on Feb 28, 2022 11:42 am IST

శర్వానంద్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రం ను శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. యూ ట్యూబ్ లో 3.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండటం తో సినిమా సూపర్ హిట్ ఖాయం అంటూ పలువురు చెప్పుకొస్తున్నారు. ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ, ఝాన్సీ, కళ్యాణి, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, రజిత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను మార్చ్ 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :