“అశోకవనంలో అర్జున కళ్యాణం” టీజర్ కి విశేష స్పందన

Published on Feb 3, 2022 1:45 pm IST


విశ్వక్ సేన్ హీరోగా రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా విద్యా సాగర్ చింత దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. SVCC డిజిటల్ పతాకం పై ఈ చిత్రాన్ని బాపినీడు బి మరియు సుధీర్ ఈదర లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించినప్పటి నుండి సినిమా పై ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :