“బ్యాక్ డోర్” ట్రైలర్ కు వస్తున్న భారీ రెస్పాన్స్!

Published on Nov 1, 2021 8:09 pm IST

లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన బ్యాక్ డోర్ ట్రైలర్ కు బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం టీజర్ పది మిలియన్ వ్యూస్ తెచ్చుకోగా, ట్రైలర్ కూడా ఆ మార్కును సునాయాసంగా దాటిపోయే దిశగా సందడి చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించి ఈ చిత్రానికి ఇప్పటికే గల క్రేజును మరింత పెంచుతోంది అని చెప్పాలి.

బ్యాక్ డోర్ ట్రైలర్ కు లభిస్తున్న స్పందన చిత్ర విజయం పై తమకు గల నమ్మకాన్ని మరింత పెంచుతోందని దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు. బ్యాక్ డోర్ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన బ్యాక్ డోర్ చిత్రానికి క్లీన్ యు సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రానికి కో డైరెక్టర్ భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్ విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ రాజ్ కృష్ణ, పాటలు నిర్మల చాందిని, సంగీతం ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రవిశంకర్, ఆర్ట్ నాని, ఎడిటింగ్ చోటా కె.ప్రసాద్, కెమెరా శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్ విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ ధీరజ్ అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రేఖ, కో ప్రొడ్యూసర్ ఊట శ్రీను, నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, రచన దర్శకత్వం కర్రి బాలాజీ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :