బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోన్న “బలగం”

Published on Mar 12, 2023 3:02 pm IST

ఈ రోజుల్లో సినిమాలు కనీసం 2 నుండి 3 వారాలు నడపడం చాలా కష్టంగా మారుతోంది. యునానిమస్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చే సినిమాలకే అది సాధ్యమవుతోంది. కాబట్టి చిన్న బడ్జెట్ సినిమాలు రెండో వారానికి చేరుకోవడం దాదాపు అసాధ్యం. అయితే ఇటీవల విడుదలైన బలగం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. నిర్మాత దిల్ రాజు ప్రకారం, ఈ చిత్రం 30,000 ఫుట్‌ఫాల్స్‌ కు తెరవబడింది. మొదటి వారం రన్‌లో 4 లక్షల ఫుట్‌ఫాల్స్‌ కు చేరుకుంది. ఈ చిత్రం రోజురోజుకు జోరుగా కొనసాగుతోంది మరియు దాని తొమ్మిదవ రోజున, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ ను నమోదు చేయడం జరిగింది, ఇది అద్భుతమైన విజయం.

ఆదివారం కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా మరికొన్ని రోజులు మంచి రన్‌ను కొనసాగించాలని ఆడియెన్స్ కూడా భావిస్తున్నారు. కమెడియన్ టర్న్ డైరెక్టర్ వేణు యెల్దండి హెల్మ్ చేసిన ఈ విలేజ్ ఫ్యామిలీ డ్రామాలో ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి బలగం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరి నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.

సంబంధిత సమాచారం :