టాప్ లో ట్రెండ్ అవుతోన్న బెల్లంకొండ శ్రీనివాస్ “ఛత్రపతి” ట్రైలర్!

Published on May 3, 2023 11:22 pm IST

యూట్యూబ్‌లో తన హిందీ డబ్బింగ్ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీనివాస్ బెల్లంకొండ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అతను తన బాలీవుడ్ ఎంట్రీ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శక దిగ్గజం రాజమౌళిల బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఛత్రపతి చిత్రాన్ని ఎంచుకున్నాడు. తెలుగు దర్శకుడు వివి వినాయక్ ఈ అధికార హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. థియేట్రికల్ ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు 4 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 70కే లైక్‌లను పొందింది.

ట్రైలర్ కూడా టాప్‌లో ట్రెండింగ్‌లో ఉంది. భారీ మాస్ యాక్షన్ చిత్రాలను చూడాలని ఆసక్తిగా ఉన్న బాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా కథానాయికగా నటించింది. సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మోనాజీర్, ఔరోషికా డే, వేదిక మరియు జాసన్ కీలక పాత్రలు పోషించారు. పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్ట్‌ను బ్యాంక్రోల్ చేయగా, పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్‌మెంట్‌కు చెందిన ధవల్ జయంతిలాల్ గడా మరియు అక్షయ్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :